సత్యసాయి: హిందూపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’ పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.