CTR: చిత్తూరు నగరంలోని రామ్ నగర్ కాలనీ వద్ద ఉన్న ఆర్టీసీ డిపోను జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. డిపో ప్రాంగణంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. చిత్తూరు డిపోకు సంబంధించిన వివరాలను ఆర్ఎం జగదీశ్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత పాల్గొన్నారు.