VZM: చీపురుపల్లి మండలం గొల్లలములగం గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుణుపూరు మహాలక్ష్ము ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న ఆయనకు వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000 స్థానంలో సీఎం ఆదేశాలతో రూ.10,000ల డయాలసిస్ పెన్షన్ను అందజేశారు.