PLD: నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈఈ సుచరిత తెలిపారు. సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసే పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. సుమారు 6 గంటల పాటు కరెంట్ కోత ఉంటుందని, గ్రామ ప్రజలు గమనించి శాఖకు సహకరించాలని ఆమె కోరారు.