ప్రకాశం: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన శుభ సందర్భంగా, అన్ని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులలో దీపాలు వెలిగించి అలంకరణలు చేయాలని సూచించారు. గురువారం కనిగిరి డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు కొవ్వొత్తులు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.