VSP: అర్హులైన పేదలకు అర్బన్‌లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ తెలిపారు. ఆదివారం భీమిలి నియోజకవర్గం దబ్బందా టిడ్కో ఇళ్ల వద్ద పోస్టర్ విడుదల చేశారు.