SKLM: సంతబొమ్మాలి మండలం వల్లేవలస శ్రీ చిన్మయానంద స్వామి ఆశ్రమం వద్ద ఈనెల 30న సాయంత్రం 3 గంటలకు జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, మహిళలు), తీత సంగిడి, ఈడుపు సంగిడి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు.