సత్యసాయి: గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్ సీపీఎం కాలనీలో తాగునీరు, కరెంట్ సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ను కలిసి 110 అర్జీలు సమర్పించారు. సమస్యను పరిశీలించిన ఆర్డీవో సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటివరకు రోజుకు రెండు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.