W.G: అత్తిలి గ్రామకంఠంలో చేపడుతున్న స్వమిత్వ పథకం భూ రీ-సర్వేతో గ్రామ ప్రజలకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని పంచాయతీ కార్యదర్శి జి.భాస్కర్ అన్నారు. ఈ సర్వే ద్వారా ఆస్తులకు సంబంధించిన హక్కు పత్రాలు లభిస్తాయని, ఇవి క్రయవిక్రయాలకు, బ్యాంకు రుణాలు పొందడానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బంది ఈ కొలతలను నిర్వహిస్తున్నారని చెప్పారు.