KDP: గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ , సెక్షన్ 144 అమల్లో ఉందని శుక్రవారం డీఎస్పీ భావన తెలిపారు. ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడిన, ఎలాంటి సమావేశం ఏర్పాటు చేసిన, ర్యాలీలు గాని ధర్నాలు గాని చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు కూడా విఘాతం కలిగించరాదని అన్నారు.