VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు అధికారులకు సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ ఫోరమ్‌లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వెంటనే స్పందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీలతో కలిసి అర్జీలను స్వీకరించిన ఆయన, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు.