సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో చేనేత కార్మికులకు నేటి నుంచి 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.