NLR: కందుకూరులో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులు, ఆటోడ్రైవర్లకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన షేక్ సలాంను ఎమ్మెల్యే అభినందించారు. డీఎస్పీ బాలసుబ్రమణ్యం ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.