ATP: శింగనమల మండలం కల్లుమడిలో మంగళవారం రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, కార్మికుల పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరిస్తున్నారన్నారు.