AKP: నాతవరం పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం ఈ నెల 14న జరగనున్నట్లు తాండవ ప్రాజెక్ట్ ఛైర్మన్ కరక సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, పోలీస్ ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారని ఆయన వివరించారు.