బాపట్ల జిల్లా: సంతమాగులూరు మండల పరిధిలోని పాతమాగులూరు ఎస్సీ కాలనీలో ‘పీఎం సూర్య ఘర్’ (ఉచిత విద్యుత్) పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ పవర్ యూనిట్లను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను పరిశీలించారు.