TPT: శ్రీకాళహస్తిలో ఇటీవలి వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రెండు నెలల వ్యవధిలో శ్రీరామనగర్ కాలనీలో రెండు చోట్ల దొంగతనాలు జరగగా, బహదూర్పేటలోని ఓ ఇంట్లో కూడా చోరీ జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలతో స్థానికులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.