అన్నమయ్య: జిల్లాలో ఈ నెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని RIO రవి తెలిపారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాల్లో 28,550 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 14,607 మంది,సెకండ్ ఇయర్ విద్యార్థులు 13,943 మంది ఉన్నారని చెప్పారు.