NTR: పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్, సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడిన విద్యార్థి తండ్రి వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఫీజుల చెల్లింపు విషయంలో వివాదం జరగగా.. సదరు వ్యక్తి ఫీజు చెల్లించకుండా పాఠశాల సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లు ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.