GNTR: ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ డిమాండ్ చేశారు. ఉచిత బస్సుల నేపథ్యంలో నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం ఉపాధి కల్పించాలని సెప్టెంబర్ 18న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టినట్టు ఇవాళ పెదకాకానిలో తెలిపారు.