కృష్ణా: ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్‌ను ఈ నెల 19 వరకు న్యాయస్థానం పొడిగించింది. అక్రమాస్తుల కేసులో శాంతి రిమాండ్ నేటితో ముగియడంతో, ఆమెను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో శాంతి రిమాండ్‌ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.