PPM: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-II పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్లు DEO పి.బ్రహ్మాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయబడిందని ఆయన పేర్కొన్నారు.