ATP: ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21న జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలీ చెప్పారు. ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి పీజీ దాకా చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరవుతారని తెలిపారు.