PPM: కురుపాం మండలం పోరండంగూడ గ్రామంలో బుధవారం కంటైనర్ ఆసుపత్రిని ప్రభుత్వ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఉద్దేశంతో ఈ సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు.