కోనసీమ: యూరియా కొరత, రైతుల సమస్యలపై దృష్టి సారించి, వైసీపీ ఈ నెల 9న ‘రైతు పోరుబాట’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి అనుమతులు కోరుతూ వైసీపీ నాయకులు అమలాపురం డిఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంఛార్జ్ పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, సంసాని బులినానిలు ఉన్నారు.