ATP: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే గడువు జూలై 15తో ముగిసింది. ఓ బాలికను పరామర్శించేందుకు అనుమతి లేకుండా వెళ్లడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై తోపుదుర్తి హైకోర్టుకు వెళ్లగా 3 వారాలు అరెస్ట్ చేయకుండా ఊరట లభించింది. ఆ గడువు ముగియడంతో పోలీసుల నిర్ణయం ఉత్కంఠగా మారింది.