NLR: సంగం పాత చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ శ్రీనివాసుల రెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 30 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపుగా 25 బైకులు, రెండు ఆటోలు, సీజ్ చేసినట్లు తెలియజేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.