కృష్ణా: పెదపారుపూడి మండలం మోపర్రులో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం ఆదివారం జరిగింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. ప్రతి గ్రామంలో క్యూ ఆర్ కోడ్ ద్వారా మోసాలను ఎండగడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాపల్లి వెంకట్ రావు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.