NDL: ఉపాధి కూలీలకు 8 వారాల నుండి బిల్లులు రాక పస్తులు ఉంటున్నారని వ్యాకాస జిల్లా సహాయ కార్యదర్శి పక్కిరి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురంలోని సచివాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం అగ్రికల్చర్ ఆఫీసర్ వసంతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.