VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్డీఏ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.