నయనతార(Nayanthara)కు ఫ్లాట్ అయ్యారా, ఆమెను ప్రేమిస్తున్నారా? అని ప్రశ్నించిన నెటిజెన్ పై ఫైరయ్యారు. షారుఖాన్(Shahrukh Khan), నయనతారా జంటగా తెరకెక్కిన జవాన్ మూవీ (Jawaan movie) రిలీజ్‌కి సిద్దమవుతుంది. దీంతో, నార్త్ తో పాటు దక్షిణాదిలో కూడా ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటున్నాయి. మరోవైపు తాజాగా తన అభిమానులతో షారుక్ చాట్ సెషన్ నిర్వహించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘జవాన్’ చిత్రం సందేశాత్మక చిత్రమని, మహిళల సాధికారత గురించి వివరించే సినిమా అని షారుక్ తెలిపారు.
మహిళలను (Women)ఎలా గౌరవించాలనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని తెలిపారు.మహిళలను ఎలా గౌరవించాలనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని తెలిపారు. ఈ చిత్రంలో మీ రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చా అన్నారు.సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘జవాన్’ సినిమాను విడుదల(Jawan Release) చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ మాస్క్ ధరించిన హీరో పదునైన ఈటెను పట్టుకుని ఎగురుతున్నాడు. పోస్టర్ చూస్తుంటే.. మరోసారి షారూఖ్ యాక్షన్ తో ఆకట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది. పఠాన్ సినిమా(Pathan movie)తో ఈ ఏడాది మెుదట్లో అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. జవాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు