ELR: లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల నుంచి ధర్మాజీగూడెం వస్తున్న చిన్ను వెంకటేశ్వరరావు (60) టిప్పర్ ఢీ కొట్టగా కిందపడి మృతి చెందాడు అని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రహదారిలో టిప్పర్ లారీలు మితిమీరిన వేగంతో వెళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.