cm kcr played games on before elections: kishan reddy
kishan reddy: తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (kishan reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు గారడీ చేయడం కేసీఆర్కు (kcr) అలవాటు అని చెప్పారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టంచేశారు. కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాటలకే పరిమితం అయ్యిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటంబం చేతిలో బంధీ అయ్యింది. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని మహాధర్నా చేపట్టింది.
ఫోటోలు తీయడం కోసం.. గ్రాఫిక్స్ కోసం అక్కడక్కడ ఇళ్లు కట్టించారని కిషన్ రెడ్డి (kishan reddy) ఆరోపించారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు ఇళ్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కొందరికీ ఇళ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారని.. లేదంటే పార్టీ కండువా కప్పుకోవాల్సి వస్తోందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టిందని వివరించారు.
దోపిడీ చేసిన సొమ్ముతో సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కడుతున్నారని కిషన్ రెడ్డి (kishan reddy) తెలిపారు. క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్, ఎమ్మెల్యేల కోసం ఇళ్లు కడతారని చెప్పారు. పేదలకు ఇళ్లు కట్టరని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే.. పేదలకు ఇళ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. తెలంగాణలో ఈ రోజు నిజాం నవాబుల పాలన ఉందన్నారు.
దేశంలో ప్రధాని మోడీ 4 కోట్ల ఇళ్లను నిర్మించారని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతీ పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయం, దళితులకు మూడెకరాల భూమి, గిరిజన్ల రిజర్వేషన్ పేరుతో మోసం చేశారని తెలిపారు. ఇంటికో ఉద్యమం.. నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వలేదు.