»Viral Post Bunny Blocked The Heroine Who Acted With Him
Bunny blocked the heroine : ఆ హీరోయిన్ను బ్లాక్ చేసిన బన్నీ.. పాపం లిప్ లాక్ కూడా ఇచ్చింది!
ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్డమ్ అనుభవిస్తున్నాడు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేసుకునేందుకు.. పుష్ప2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ పార్ట్ వన్‌కి పెట్టిన బడ్జెట్‌కు డబుల్, ట్రిపుల్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బన్నీ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తనతో ఏదైనా ప్రమోషన్స్ చేయిస్తే.. బాగానే కలిసొస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్డమ్ అనుభవిస్తున్నాడు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌ను డబుల్ చేసుకునేందుకు.. పుష్ప2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ పార్ట్ వన్‌కి పెట్టిన బడ్జెట్‌కు డబుల్, ట్రిపుల్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బన్నీ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తనతో ఏదైనా ప్రమోషన్స్ చేయిస్తే.. బాగానే కలిసొస్తుంది. అల్లు అర్జున్ కూడా మిగతా వాళ్లకు సపోర్ట్ చేమయడంలో ఎప్పుడు ముందుంటాడు. కానీ ఓ హీరోయిన్ మాత్రం.. తనను బ్లాక్ చేశాడని.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పడేసింది. దాంతో అప్పుడెప్పుడో కనిపించిన ఆ హీరోయిన్.. బన్నీ పేరు వాడి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన బన్నీ.. ఆమెను బ్లాక్ చేయడం కాస్త షాకింగ్‌గానే ఉంది. అప్పట్లో గుణశేఖర్ దర్శకత్వంలో ‘వరుడు’ అనే సినిమా చేశాడు బన్నీ. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ఆర్య విలన్‌గా నటించాడు. హీరోయిన్ భానుశ్రీ మెహ్రా నటించింది. ఆ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో.. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాల రాలేదు. ఒకటి అరా సినిమాలు చేసినా.. హీరోయిన్గా కెరీర్ లాగలేకపోయింది. కానీ మళ్లీ ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చి.. తనను బన్నీ తన ట్విట్టర్లో బ్లాక్ చేశాడని.. స్క్రీన్ షాట్‌ను తీసి మరీ పోస్ట్ చేసింది. దాంతో అమ్మడి పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఇది కూడా భానుశ్రీకి కలిసొచ్చేలానే ఉంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోలు చేస్తోంది. దాంతో అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్లో బ్లాక్ చేశారు అని చెబుతునే.. ముందుగా తన ఛానల్‌ను సబ్‌స్రైబ్ చేసుకోండని పోస్ట్ చేసింది. మొత్తంగా బన్నీ పేరును ఇలా కూడా వాడుకుంది అమ్మడు. అయితే నెటిజన్స్ ఫీలింగ్ మాత్రం వేరేలా ఉంది.. వరుడు సినిమాలో భానుశ్రీ, బన్నీకి లిప్ లాక్ కూడా ఇచ్చింది. దాంతో లిప్ టేస్ట్ చేసిన బ్యూటీనే బన్నీ బ్లాక్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. ఈ బ్యూటీకి లిప్ లాక్ ఇచ్చిన ఫలితం దక్కలేదని అంటున్నారు.