కోనసీమ ప్రాంతానికి వన్నెతెచ్చిన మహనీయుడు దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మల్కిపురం మండలంలోని దిండి గ్రామంలో నిర్వహించిన బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, తదితరులు పాల్గొన్నారు.