విశాఖ జిల్లాలో పీఎం సూర్యఘర్ యోజన అమలను వేగవంతం చేసి మూడు నెలల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో డీఆర్డీఏ, యూసీడీ గ్రూపుల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించి బ్యాంకు రుణాలు, కేంద్ర రాయితీలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ విద్యాధరి పాల్గొన్నారు.