టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ లో బళ్లారి ఫెస్టివ్ లో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని గెస్టులుగా విచ్చేశారు. మొదటి రోజు కార్యక్రమంలో సింగర్ మంగ్లీతో కలిసి మరికొంత మంది గాయకులు పాల్గొన్నారు.
గత కొన్నిరోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి మంగ్లీ హాజరైంది. ఆ సమయంలో ఆమెను కన్నడలో మాట్లాడాలని యాంకర్ అనుశ్రీ కోరింది. అయితే అందరికీ తెలుగు వస్తుందని కదా అని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం మేరకు రెండు మాటలు మాట్లాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమ సమయంలో మంగ్లీ తీరుపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.