ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప2. పుష్పకి సీక్వెన్స్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రష్మిక మందనా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
పుష్ప 2 లో ఓ అతిధి పాత్ర ఉందిని, ఈ పాత్రలో హిందీ స్టార్ రణవీర్ సింగ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాలో కీలకసమయంలో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్ర సినిమాలో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా, ఈ సినిమా విడుదలకు ముందే మరో గాసిప్ బయటకు వచ్చింది. అదేంటో కాదు పుష్పకి మూడో పార్ట్ కూడా ఉందట.
ఇప్పుడు త్రీక్వెల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ ఫ్రాంచైజీగా చేయాలనే ఉద్దేశ్యంతో పుష్పకు సిద్ధం చేసినట్లు ఆన్లైన్లో గాసిప్ చక్కర్లు కొడుతోంది. మావెరిక్ చిత్రనిర్మాత భాగానికి పుష్ప 3: ది రూల్ బిగిన్స్ అనే పేరు పెట్టారు అంటూ ప్రచారం జరుగుతోంది. నటుడు ఫహద్ ఫాసిల్ కూడా పుష్ప 3 ఉంటుందని గతంలో చెప్పడం గుర్తుండే ఉంటుంది. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనా కాదా అనేది తెలియాలంటే మేకర్స్ నుండి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాలాకు సీక్వెన్స్ వచ్చాయి కానీ ఇలా త్రీక్వెల్ రావడం జరగలేదు. ఆ రికార్డు ను అల్లు అర్జున్, సుకుమార్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.