KDP: కాశీనాయన మండలంలోని ఆకుల నారాయణపల్లె, సావిశెట్టిపల్లె గ్రామాల్లో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కళాజాత కార్యక్రమం జరిగింది. అడవికి నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు, ఎర్రచందనం పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,సిబ్బంది పాల్గొన్నారు.