ప్రకాశం: ఉగాది సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పాడి పంటలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉగాది కానుకగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, దివ్యాంగులకు “దివ్యాంగ శక్తి” అందించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.