మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 7వ సినిమా తర్వాత, రామ్ చరణ్(Ram Charan) ఫోన్ చేసి స్క్రిప్ట్‌ల ఎంపిక గురించి చెప్పారని. కచ్చితంగా కొత్తగా, యూనిక్ గా ఉండే కాన్సెప్ట్ లు ఎంచుకోమని ఆయన సలహా ఇచ్చారని వరుణ్ తేజ్(Varun Tej) తెలిపారు. ఆగష్టు 25న గాండీవదారి అర్జున మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ లో ఉంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ కాప్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలు మించి ఆకట్టుకుంటోంది.
కొత్తదన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మన కారణంగా పర్యావరణ (environmental)విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతోంది. అభివృద్ధి పేరుతో అడవులని నాశనం చేయడం, గనుల కోసం భూములని తవ్వేయడం కారణంగా మనకు మనం ఎలాంటి ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నామో ఈసినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.మూవీలో పర్యావరణవేత్తగా ఉన్న నాజర్ ని పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ రక్షించడం కోసం ఎలాంటి ఆపరేషన్ చేశాడు. అనేది టీజర్ (Teaser) ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.అన్న ఇచ్చిన సలహా ప్రకారం ఇప్పుడు గాండీవదారి అర్జున (Gandivadhari arjuna)సెలక్ట్ చేసుకొని చేస్తున్న అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి ఈ మూవీ సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన దానిని రామ్ చరణ్ ఒక కారణం అవుతారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సక్సెస్ అయితే మాత్రం చరణ్ కరెక్ట్ గా సజిస్ట్ చేశారని మెగా ఫ్యాన్స్ కూడా కితాబు ఇస్తారు.