Doctor నిర్వాకం.. ఆపరేషన్ చేసి కత్తెర మరచి, కడుపునొప్పి రావడంతో..
కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
Scissor Found: సర్కార్ దవాఖాన అంటే ఇప్పటికీ జనాలకు నమ్మకం ఉండటం లేదు. పేదలు.. తప్పదు అనుకుంటే తప్ప వెళ్లడం లేదు. అలా వెళ్లిన వారి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అవును.. ఎప్పుడు ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భవతికి ఆపరేషన్ చేసి.. కడుపులోనే కత్తెర (Scissor) మరచిపోయారు. కడుపునొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో.. ఎక్స్ రే తీశారు.
ఎక్స్ రే తీయగా అందులో కత్తెర (Scissor) స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పిక్‌ను ఎక్స్ రే తీసే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో వైరల్ అవుతుంది. సర్కార్ డాక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికీ మారారా..? జనాల ప్రాణాలతో చెలగాటం ఎన్ని రోజులు ఆడతారు..? ఎందరినీ ఇలా ఇబ్బందికి గురిచేస్తారని ఏకీపారేస్తున్నారు. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పెద్దపాడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన జీ స్వప్న అనే మహిళ కాన్పు కోసం ఏప్రిల్ 19వ తేదీన ఆస్పత్రికి వచ్చింది. సిజేరియన్ చేసి.. సీనియర్ సివిల్ సర్జన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాడు. కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను (Scissor) మరచిపోయాడు. ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆ మహిళా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నెల 8వ తేదీన మాత్రం విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో మరోసారి ఆస్పత్రికి రాగా ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే తీసిన ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అతనిని మందలించడంతో ఆ పోస్ట్ తొలగించాడు. ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి కేసు షీట్, అడ్రస్, ఫోన్ నంబర్ లేవు. ఆస్పత్రి ఆవరణలో ఎక్స్ రే విభాగంలో తీసిన రికార్డుల్లో మాత్రం బాధితురాలి పేరు, తేదీ ఉన్నాయి.
ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో తాను సెలవులో ఉన్నానని ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరించారు. ఆ మహిళ కడపులో కత్తెర మరచిపోయింది వాస్తవమేనని అంగీకరించారు. ఘటనపై విచారణ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ కమిటీ వేశారు.