»Heart Beating Are Stop While Play The Djs What Are The Doctors Saying
DJల మోతతో ఆగుతున్న గుండెలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
డీజేల మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. డీజేలు వద్దు.. కోటాలు, భజనలు ముద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.
Heart Beating Are STOP While Play The DJ's.. What Are The Doctors Saying..?
DJ: కాలం మారింది. సన్నాయి, డప్పులు తర్వాత బ్యాండ్ వచ్చింది. తర్వాత డీజే (DJ) మోత మోగుతోంది. డీజేలపై కొన్ని చోట్ల ఆంక్షలు ఉన్నప్పటికీ.. యథావిధిగా ప్లే చేస్తున్నారు. మితిమీరిన సౌండ్ వల్ల గుండె లయ తప్పుతున్నాయి. అవును.. కొందరు డీజే సౌండ్ వల్ల ఒత్తిడికి గురై.. చనిపోతున్నారు. అధిక శబ్దం వద్దు.. డీజే వాద్దని వైద్యులు సూచిస్తున్నారు. పెడచెవిన పెట్టి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కాలుష్యం పెరిగి..
డీజే సౌండ్ వల్ల శబ్ద కాలుష్యం భారీగా పెరుగుతోంది. దీంతో పిల్లలు, వృద్దులు తట్టుకోవడం లేదు. మెదడు, గుండె, చెవికి సంబంధించిన రుగ్మతలకు గురవుతున్నారు. శబ్దానికి దగ్గరగా ఉండి.. డ్యాన్స్ చేయడంతో చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. వినికిడి సమస్య వచ్చిన వారు కూడా చాలా మందే ఉన్నారు. శబ్దం అతిగా వింటే గుండెకు ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. 50 డెసిబుల్ సౌండ్ వింటే గుండె బాగానే పనిచేస్తుందని.. ఆ సౌండ్ పెరిగే కొద్దీ 8 శాతం గుండె దడ పెరుగుతుందని చెబుతున్నారు.
60 వేల మందికి సమస్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏడాదిలో 60 వేల మంది అతి శబ్దం విని గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. 45 వేల మంది చిన్నారులు పెద్ద శబ్దాలు విని.. మెదడు, చూపు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడికి గురై.. గుండెపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 90 నుంచి 120 డెసిబుల్ సౌండ్ అరగంట సేపు వింటే చెవి పాడవుతోందని ఈఎన్టీ నిపుణులు వివరించారు. 120 డెసిబుల్ దాటిన శబ్దం 30 సెకన్ల పాటు వింటే చెవి తక్కువ వినపడుతుందని వివరించారు. ఏదో రింగ్ లాంటి శబ్దం వింటారని పేర్కొన్నారు. ఆ వెంటనే విపరీతమైన చెవినొప్పి వస్తోందని తెలిపారు.
కర్ణభేరికి రంధ్రం
కొన్ని సందర్భాల్లో కర్ణభేరికి రంధ్రం పడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. సమీపంలోని ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలని సూచించారు. వేడుక, శోభాయాత్రలో పాల్గొనేవారు విధిగా ఈయర్ ఫ్లగ్స్ ధరించాలని సూచించారు. లేకుంటే మెత్తటి దూదిని చెవుల్లో పెట్టుకోవాలని మరీ చెబుతున్నారు.
కోలాటలు, భజనలు ముద్దు
డీజే మోజును వీడి ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డీజేలకు బదులు కోలాటలు, భజనలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులు నిర్వహిస్తే బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు.