KRMB Order To Ap Government Stop Taking Water From Nagarjuna Sagar
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్ట్ నుంచి నీరు తీయడంతో తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ మొదలైంది. దీంతో కృష్ణా బోర్డు (krishna board) స్పందించింది. తక్షణమే సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీయడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేశామని లేఖలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టంచేసింది.
సాగర్ డ్యామ్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్ల కంచెల మధ్య సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్త్ నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మొహరించారు. 1200 మంది పోలీసులు ఉన్నారు. తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.