మేం మేం అంతా బాగానే ఉంటాం.. మీరు కూడా అలాగే ఉండాలి.. అని తరచుగా స్టార్ హీరోలంతా చెప్పే మాట ఇది. అయినా కూడా ఫ్యాన్ వార్ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తిట్టుకునుడే కాదు.. డైరెక్ట్‌గా కొట్టుకుంటున్నారు కూడా..!
Allu Arjun fans: తమ మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, కేవలం తమ సినిమాల మధ్యనే పోటీ ఉంటుందని చాలాసార్లు చెప్పిన సందర్భాలున్నాయి. అభిమానుల మధ్య కూడా అలాంటివి ఉండకూడదని, కలిసి వుండాలని కూడా చెబుతునే ఉన్నారు. అయినా కూడా కానీ మేం మారమంటే మారం.. అన్నట్టుగా ఉంది అభిమానుల వ్యవహారం. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూస్తునే ఉన్నాం. గతంలో థియేటర్ల దగ్గర ఆఫ్‌లైన్‌లో కొట్టుకునే వారు.. కానీ సోషల్ మీడియా వచ్చాక మాటలతోనే ఆన్లైన్లో కొట్టుకున్నంత పని చేస్తున్నారు. పోనీ.. ఇక్కడితో ఆగుతారా అంటే.. అస్సలు ఛాన్సే లేదంటున్నారు. అందుకు నిదర్శనమే లేటెస్ట్ వైరల్ వీడియో అని చెప్పాలి.
అసలు అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ.. బెంగుళూరులో ఓ ప్రభాస్ ఫ్యాన్‌ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో ప్రభాస్ అభిమాని ఒక్కడే ఉన్నాడు. బన్నీ ఫ్యాన్స్ మాత్రం పది మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ అభిమానిని వారు రక్తం వచ్చేలా కొట్టినట్టుగా వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే.. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకున్నారనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ప్రభాస్ ‘కల్కి’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తుండగా.. బన్నీ ‘పుష్ప2’ రాబోతున్నాడు. ఏదేమైనా.. స్టార్ హీరోల అభిమానులకు