MBNR: తమ్ముడి వివాహానికి సహకరించిన అన్నను హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. యువతి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.