»Viral News The Owner Tied Up Four Children And Beat Them For Stealing Kurkure
Viral News: కుర్కురే దొంగిలించారని నలుగురు పిల్లలను కట్టేసి కొట్టిన యజమాని
చిన్న పిల్లలది తెలిసి తెలియని వయసు. వారు చేసే పనులు అల్లరి అల్లరిగా ఉంటాయి. ప్రతి కిరణా షాపుకు వారు వెళ్తే చాలు. పలు రకాల చిరుతిండి పదార్థాలు తీసుకోవాలని చూస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. నలుగురు చిన్నారులు(children) ఓ షాపుకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే కుర్కురే, బిస్కెట్లు తీసుకున్నారు. అది గమనించిన షాపు యజమాని వారిని స్తంభానికి కట్టేసి కొట్టాడు. ఈ ఘటన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు.
Viral News The owner tied up four children and beat them for stealing Kurkure
బీహార్(bihar)లో దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలు కుర్కురే చిప్స్ లేదా బిస్కెట్లు దొంగిలించారనే కారణంతో కిరాణషాపు(grocery shop) యజమాని నలుగురు చిన్నారులపై అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఆ క్రమంలో వారిని ఏకంగా స్తంభానికి కట్టేసి దారుణంగా చితకబాదాడు. ఈ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్ జిల్లా బీర్పూర్ తాలూకా ఫజిల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
అదే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఈ నెల 28న ఓ షాపులో కుర్ కురే, బిస్కెట్ ప్యాకెట్లను దొంగిలించారు. ఆ సమయంలో షాపు యజమాని పిల్లల(children) చర్యను గమనించాడు. అంతటితో ఆగకుండా వారిని పట్టుకుని సమీపంలోని స్తంభం వద్దకు తీసుకెళ్లాడు. ఆ స్తంభానికి వారి చేతులు కట్టేశాడు. ఆ తర్వాత వారిని కొట్టాడు. ఆ సమయంలో అక్కడ చాలా మంది నిలబడి ఈ అల్లరి అంతా చూస్తున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. బాధిత బాలురు ఇంటికి వెళ్లగా.. పిల్లల పరిస్థితి చూసి ఏం జరిగిందని తల్లిదండ్రులు అడిగారు. అబ్బాయిలు జరిగిన విషయం వివరించారు. అయితే దీనిపై వారు ఫిర్యాదు చేయలేదు.
అయితే అక్కడ ఉన్న పలువురు బాలురను స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. చివరకు స్థానిక పోలీసులు(police) కూడా తెలుసుకున్నారు. దీంతో పోలీసులు బాలుర తల్లిదండ్రులను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని షాపు యజమానిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. దీనిపై బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ కూడా స్పందించారు. చిన్నారులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం తీవ్ర నేరమని అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.