HYD: గచ్చిబౌలి ప్రాక్టీస్ గ్రౌండ్లో త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్టిఫిషియల్ ఫుట్బాల్ టర్ఫ్ సిద్ధం కాబోతోంది. రూ. 9 కోట్లతో నిర్మించనున్న ఈ మైదానం ఫిఫా నిబంధనల ప్రకారం 50-60mm ఎత్తు గల సింథటిక్ గడ్డి, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో రూపుదిద్దుకోనుంది. నగరంలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న యువ క్రీడాకారులకు ఇది ఒక వరం.