AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు మరికాసేపట్లో లోక్సభ ముందుకు రానుంది. దీనపై MP కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. 2028 నాటికి దేశం గర్వించే నగరంగా అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. దీన్ని అడ్డుకుంటే YCPకి తర్వాతి ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు.