VKB: నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన నూర్జనబేగం డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో నాటు కోళ్లను పెంచుతూ జీవనం సాగిస్తుంది. వీధి కుక్కలు స్వైర విహారం చేసి నాటు కోళ్లపై మంగళవారం రాత్రి దాడి చేశాయి. దీంతో 48 నాటు కోళ్లు చనిపోయాయి. బాధితురాలు ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరింది. వీధి కుక్కల బెడద నివారించాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.